HI

01 january 2023 soul sustenance

నూతన సంవత్సరానికి ఆధ్యాత్మిక ప్రతిజ్ఞ చేసుకుందాం రండి

నూతన సంవత్సరాన్ని ప్రారంభించినప్పుడు, మనమందరం విభిన్న ప్రతిజ్ఞలను చేసుకుంటూ ఉంటాము – మనలో కొందరు తమ ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకునేందుకు అనేక ప్రమాణాలు చేసుకుంటారు, కొందరు తమ కార్యాలయంలో అదనపు ఉత్పాదకతను పెంచుకొని తమ వృత్తి వ్యాపారాలలో మరింత సఫలత పొందాలనుకుంటారు; మరి కొందరు ప్రేమ, కరుణ మరియు సంతృప్తితో కూడిన మరియు విభేదాలు లేని అందమైన సంబంధాలను ఏర్పరుచుకోవాలనుకుంటారు, కొందరు తమ జీవనశైలిలో మార్పును తీసుకురావాలని కోరుకుంటారు, ఇంకొందరు స్వయానికి లేక ఇతరులకు అసౌకర్యాన్ని కలిగించే నిర్దిష్ట అలవాటును మార్చుకోవాలని అనుకుంటారు. అలాగే, మనలో కొందరు మన జీవితంలో ఒత్తిడి నుండి విముక్తి అయి మరింత శాంతి, ఆనందం మరియు స్వేచ్ఛను అనుభవించాలని కోరుకుంటారు.ఇలా ఎన్నో ప్రమాణాలు చేసుకుని నూతన సంవత్సరాన్ని మన కోసం మనం నిర్దేశించుకున్న లక్ష్యానికి కట్టుబడి ప్రారంభిస్తాము. మనం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించాలని కోరుకుంటాము. పరమాత్ముడు తన ఆధ్యాత్మిక జ్ఞానబోధనలో నూతన సంవత్సర వేడుకను కేవలం ఆ ఒక్క రోజుకు మాత్రమే పరిమితం చేయకుండా ప్రతిరోజూ ఆధ్యాత్మిక నూతన జీవనాన్ని రూపొందించుకొని, తద్వారా కలిగే ప్రయోజనాలను ఆనందించాలని బోధిస్తారు. మరి ఆ నూతన ఆధ్యాత్మిక జీవనాన్ని ఎలా రూపొందించుకోవాలి? పరమాత్ముడు మనకు అందించే ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా ఆ నూతన ఆధ్యాత్మిక జీవనాన్ని రూపొందించుకోవచ్చును. అలాగే, జ్ఞానంతో పాటు, మనలోని ఆంతరిక గుణాలను మరియు శక్తులను ఆ పరమాత్మునితో బుద్ధిని ఏకాగ్రం చేయడం ద్వారా పెంపొందించుకోవడమే కాకుండా మన వ్యక్తిత్వంలో భాగంగా చేసుకోవచ్చును. తద్వారా స్వయంపై అధికారిగా అవ్వడంతో మనం చేసుకున్న ప్రతిజ్ఞలకు ఆంతరిక శుభభావనలు మరియు శక్తి అందించవచ్చు. ఈ శుభభావనలు మరియు శక్తియే ఆ ప్రమాణాలు సాకారం చేసుకునేందుకు దోహదపడతాయి.
కనుక , ఇది మన మొదటి మరియు అత్యంత ముఖ్యమైన నూతన సంవత్సర ప్రతిజ్ఞ అయి ఉండాలి, ఎందుకంటే ఈ ప్రతిజ్ఞను నెరవేర్చడం వలన మన జీవితంలో భౌతిక మరియు భౌతికేతర అన్ని విజయాలకు ద్వారాలు తెరుచుకుంటాయి. అదే విధంగా , జ్ఞానము, గుణాలు ,శక్తులతో నిండిన కొత్త ఆలోచనలు, మాటలు, కర్మలు మరియు అలవాట్లతో మనం ప్రతి రోజును ఆధ్యాత్మికంగా సచేతనం చేసుకుంటే, సంతుష్టత మరియు సంపన్నత యొక్క అనుభవం కలుగుతుంది. ఈ సంతుష్టత మరియు సంపన్నత మన జీవితానికి పునాదిగా మారుతుంది. జీవితంలో పెరిగే సంతుష్టత మరియు సంపన్నత ద్వారా మనం సాధించాలనుకునేవి తక్కువ సమయంలో సులభంగా సాధిస్తాము . కాబట్టి, ఈ ఆధ్యాత్మిక ధృడత్వం మరియు ఆధ్యాత్మిక ప్రతిజ్ఞ మన కర్మలు మరియు సంబంధాలలో నేటి ప్రపంచంలో అవసరమైన కొత్తదనాన్ని తీసుకురావడానికి సహాయం చేస్తుంది. ఈ ఆధ్యాత్మికతయే సమస్యలన్నింటికీ పరిష్కారం.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

29th mar 2024 soul sustenance telugu

పరిమితులు మరియు మానసిక అవరోధాలను మించి ఎదగడం (పార్ట్ 3)

మన మనస్సులో మానసిక పరిమితిని ఏర్పరచుకున్నప్పుడు, చేయవలసిన మొదటి పని అంతర్గతంగా  చెక్ చేసుకోవటం. మానసిక మరియు ఆధ్యాత్మిక శక్తి సహాయంతో దానిని మార్చడం తదుపరి దశ. ఇది లేకుండా పరిమితి మన వ్యక్తిత్వాన్ని

Read More »
28th mar 2024 soul sustenance telugu

పరిమితులు మరియు మానసిక అవరోధాలను మించి ఎదగడం (పార్ట్ 2)

కఠిన పరిస్థితుల నుండి బయటపడటంలో మనం తికమక పడుతూ ఉంటాము లేదా సానుకూల దృఢవిశ్వాసాన్ని కోల్పోతాము. దీని వలన మనం  విజయం పొందేది గణనీయంగా తగ్గుతుంది. నిశ్చయ శక్తికి హానికరమైన మన రకరకాల మానసిక

Read More »
27th mar 2024 soul sustenance telugu

పరిమితులు మరియు మానసిక అవరోధాలను మించి ఎదగడం  (పార్ట్ 1)

మన జీవిత ప్రయాణంలో మన జీవిత లక్ష్యాల వైపు మన పురోగతిని మందగించేలా మానసిక పరిమితులు మనకు అడ్డంకులు. వాటిని దాటి ఎదగడం అనేది మనం శిక్షణ పొందవలసిన ముఖ్యమైన ఆధ్యాత్మిక నైపుణ్యం. పరిమితి

Read More »