02 january soul sustenance telugu

నాలో ఉన్న శ్రేష్టతకు చేరుకోవడం (భాగం -1)

మన జీవితంలో చాలా ముఖ్యమైన మరియు ప్రభావవంతమైన అంశం – మన ప్రతీ ఆలోచనను కర్మ రూపంలో తీసుకుని రావాలని కోరుకుంటాము. “చెప్పటం చేయటం ఒకటై ఉండాలి” అనే నానుడి ఉంది. మరో మాటలో చెప్పాలంటే, మీకు చాలా ఆదర్శవంతమైన ఆలోచనలు మరియు మంచి అభిప్రాయాలు ఉండవచ్చు. మీరు వాటిని ఆదర్శంగా తీసుకుని నడుస్తూ ఉండవచ్చు. కానీ కొన్నిసార్లు ఆ ఆలోచనలు కార్య రూపంలోకి తీసుకొని వచ్చినప్పుడు ఆ ఆదర్శాల ప్రకారం జీవించరు,ఇది మిమ్మల్ని మరియు ఇతరులను కలవరపెడుతుంది మరియు దుఃఖాన్ని ఇస్తుంది.
ఉదాహరణకు ఈ రోజు నేను ఎలాగైనా సంతోషంగా ఉండాలని మరియు అందరికీ సంతోషాన్ని పంచాలని నిర్ణయించుకుంటాను. కానీ నేను ఏదైనా పరిస్థితిని లేదా సమస్యను ఎదుర్కొన్న కొంత సమయంలోనే ఆందోళన చెంది మరియు ఇతరులను కూడా ఆందోళనకు గురిచేస్తాను. మరొక రోజు, నేను అందరికీ శుభకామనలు మాత్రమే అందించాలని నిర్ణయించుకుంటాను. కానీ ప్రతికూల ప్రవర్తనను ఎదుర్కోవలసి వచ్చిన వెంటనే,నేను నాలో ప్రేమ తగ్గిపోయి అవతలి వ్యక్తి గురించి తప్పుగా ఆలోచించడమే కాకుండా ఇతరులతో ఆ వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడడం జరుగుతుంది. ఇది మన సంబంధాలను దిగజారుస్తుంది.
ఇలాంటి మరెన్నో నిర్ణయాలు ప్రతి రోజూ సాధించడానికి ప్రయత్నిస్తాము.కొన్నిసార్లు వాటిని చేయడంలో విజయం సాధిస్తాము ,మరి కొన్నిసార్లు చేయలేకపోవచ్చు. దీనికి కారణం ఏమిటి? మనమందరం హృదయాంతరాలలో మంచి వ్యక్తులుము కాదా ? అంతర్గతంగా అందరూ మంచివారే .ప్రతి ఒక్కరూ తమ అంతరాత్మలో శుద్ధమైన వారు అని ఆధ్యాత్మిక జ్ఞానం చెప్తుంది. అలాగే, ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒక సమయంలో మంచి వ్యక్తులుగా ఉండాలని కోరుకుంటారు. కొందరు తమ జీవితంలో మరియు స్వభావంలో మంచి మార్పును తీసుకురావడంలో దృఢంగా ఉంటారు మరియు కొందరు దాని గురించి ఆలోచిస్తారు కానీ దృఢ సంకల్పంతో తమ వ్యక్తిత్వంలోకి తీసుకురారు.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

20th jan soul sustenance - telugu

20th Jan - జీవన విలువలు

పరిష్కారాల గురించి మాత్రమే ఆలోచించండి మరియు మాట్లాడండి కొన్నిసార్లు పరిస్థితులు సవాలుగా లేదా వ్యక్తులను మేనేజ్ చేయడం కష్టంగా ఉన్న సమయాలను మనం ఎదుర్కొంటాము. మనము సమస్యపై దృష్టి పెడితే, మనం కలత చెందుతాము,

Read More »
19th jan soul sustenance - telugu

19th Jan - జీవన విలువలు

భగవంతుడు ప్రపంచాన్ని ఎలా పవిత్రం చేస్తాడు (పార్ట్ 3)? మనం నిన్నటి సందేశంలో చర్చించినట్లుగా, ప్రపంచంలోని అన్ని ఆత్మలు రాగియుగం మరియు ఇనుపయుగంలో అనేక నెగెటివ్ మరియు అపవిత్రమైన కర్మలను చేస్తారు . ఫలితంగా,

Read More »
18th jan soul sustenance - telugu

18th Jan - జీవన విలువలు

భగవంతుడు ప్రపంచాన్ని పావనంగా ఎలా చేస్తాడు (భాగం – 2)? భగవంతుడు పరివర్తనకు అతీతుడు. భగవంతుడు ఎల్లపుడూ పవిత్రత, గుణాలు మరియు శక్తులతో నిండి ఉంటాడు. భగవంతుడు తన ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా చెప్పినట్లుగా,

Read More »